నీలోఫర్ ఆస్పత్రిలో పసికందును వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు

TG: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు రోజుల పసికందును తల్లిదండ్రులు నిర్దయగా వదిలి వెళ్లిపోయారు. ఒడిశాకు చెందిన దంపతులు తమ శిశువును శ్వాసకోస సమస్యతో ఏప్రిల్ 25న ఆస్పత్రిలో చేర్పించి అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యులు శిశువుకు ఎన్‌బీసీయూలో చికిత్స అందించి కాపాడారు. పసికందును శిశు విహార్‌కు తరలిస్తున్నట్లు, తల్లిదండ్రులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్