TG: నిజామాబాద్ మిర్చి కాంపౌండ్‌లో ఆడ శిశువు విక్రయానికి సంబంధించి ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు పసిబిడ్డను అమ్మేశారు. రూ.2 లక్షలకు మహారాష్ట్రలోని వ్యక్తికి అమ్మినట్లు తెలుస్తోంది. స్థానికులు చైల్డ్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో అధికారులు శిశువును రికవర్ చేసి సంరక్షణ గృహానికి తరలించారు. ఐదుగురిపై కేసు నమోదైంది.