పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సిమ్రత్ కౌర్ తన 23 ఏళ్ల కుమార్తె పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వాలని భావించగా ఊహించని పరిణామం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోని కూతురు గదికి సిమ్రత్ వెళ్లారు. దాదాపు 15 నిమిషాల పాటు తలుపు తట్టినా ఎవరూ స్పందించలేదు. చివరకు కుమార్తె తలుపు తెరవగా, తను చదువుకుంటున్నానని తెలిపింది. అయితే, అదే సమయంలో పక్క గది వ్యక్తి వచ్చి కిటికీలో నుంచి ఎవరో దూకారని, అతనికి గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ కూతురికి దేహశుద్ది చేసింది.