పరిగి జనహిత పాదయాత్ర విజయవంతం: టీపీసీసీ చీఫ్

TG: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర విజయవంతం అయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలతో మమేకం కావాలని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారని వివరించారు. సీఎం రేవంత్ కూడా పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్