పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. సెమీస్ లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపెజ్ తో జరిగిన పోరులో ఆమె 5-0 తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో భారత్ కు పతకం ఖాయమైంది. రేపు జరిగే ఫైనల్ లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ దక్కుతుంది. మరోవైపు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్ గా వినేశ్ చరిత్ర సృష్టించారు.