పార్కింగ్‌ వివాదం.. 30 ట్రక్కులను ధ్వంసం చేసిన పోలీసులు (వీడియో)

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని న్యూ అలిపోర్‌లో పార్కింగ్ వివాదం తీవ్రరూపం దాల్చింది. మంగళవారం రోడ్డుపై నిలిపిన 30 ట్రక్కులను పోలీసులు ధ్వంసం చేయడంతో ట్రక్కు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "40 ఏళ్లుగా ఇక్కడే ట్రక్కులు నిలుపుతున్నాం, ముందస్తు నోటీసు లేకుండానే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు" అని ట్రక్కు యజమానులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్