దేశ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, జనగణన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. జనాభా గణాంకాల్లో ఖచ్చితత్వం కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ప్రజలు అందించే సమాచారం పూర్తిగా భద్రంగా, గోప్యంగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.