ఎయిర్‌పోర్ట్‌లోకి పరుపుతో ప్రయాణికుడు.. వీడియో వైరల్

బెంగళూరు విమానాశ్రయంలో గురువారం ఒక ప్రయాణికుడు వీపుపై పరుపుతో టెర్మినల్‌లోకి ప్రవేశించాడు. పరుపు కొనుగోలు రసీదు, వారంటీ కార్డ్‌తో పాటు పవర్ బ్యాంక్‌ను కూడా వెంట తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇండిగో విమానాల రద్దు, ఆలస్యంపై సెటైర్లు వేశారు. గంటల తరబడి ఆలస్యం కోసం ప్రయాణికుడు సిద్ధమై వచ్చాడని, విమాన ప్రయాణికులు స్లీపర్ కోచ్ ప్రయాణికులుగా మారారని, విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ల మాదిరిగా మారాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్