TG: డబ్బులు లేక, ఆకలితో అలమటించి ఓ ప్రయాణికుడు రైలులో స్పృహ తప్పి పడిపోయాడు. ఏపీలోని అల్లూరి జిల్లా పెదబయలుకు చెందిన జీవన్, లోకేశ్ ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఆకలితో నీరసించి జీవన్ స్పృహ కోల్పోయాడు. రైలు మధిర స్టేషన్‌కు రాగానే జీవన్‌ను పోలీసులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.