వెస్టిండీస్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టారు. తన బౌలింగ్‌లోనే విండీస్ బ్యాటర్ కేసీ కార్టీ డిఫెన్స్ ఆడబోగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. కమిన్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో బాల్ అందుకున్నారు. ఇది చూసిన కార్టీ కాసేపు నమ్మలేకపోయారు. జోసెఫ్ దెబ్బకు ఆసీస్ 286 పరుగులకే ఆలౌట్ కాగా, WI స్కోరు 101/3.