మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్న పేషెంట్ (వీడియో)

మహారాష్ట్రలోని వార్ధా జిల్లా తళేగావ్ శ్యామ్‌జీ పంత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. వైద్య పరీక్షల కోసం ఐదుగురు పోలీసులు తీసుకువచ్చిన ఖాదిర్ అలీ రజాక్ అలీ అనే నిందితుడు.. విధుల్లో ఉన్న డాక్టర్ శ్రద్ధా భుమ్రేపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి చెంపపై కొట్టాడు. ఈ ఘటనపై వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రుల్లో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓపీడీ సేవలను నిలిపివేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్

✕
✕