కొన్నేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర భారత చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తోంది. దేశభక్తి ఇతివృత్తం బాలీవుడ్‌కు ప్రధాన విజయ సూత్రంగా మారింది. 'దురందర్' చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేయగా, 'బోర్డర్ 2' చిత్రం ఐదు రోజుల్లో 350 కోట్లు సాధించి అదే జోరును కొనసాగించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తిరిగి విజయాల బాట పట్టింది.