AP: తన కుమార్తెలతో శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు రెండో కుమార్తె పొలెనా అంజన కొణిదెలతో డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అయితే ఇటీవల జగన్ తిరుమల వస్తానని ప్రకటించిన సమయంలో కూటమి నేతలు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. డిక్లరేషన్‌పై సంతకం చేయనని జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించిన పవన్.. జగన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని చర్చ నడుస్తోంది.