పవన్ కల్యాణ్ కు మతిమరుపు ఉందేమో: పేర్ని నాని

AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు మాజీ మంత్రి పేర్శినాని గుప్పించారు. పవన్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లేనని, వైఎస్ఆర్ ను ఎదిరించానని చెప్పుకోవడం మతిమరుపుతో కూడుకున్నదని పేర్శినాని ఆరోపించారు. ఏపీలో మీటింగ్ పెట్టలేని పవన్, తెలంగాణలో పెడతానని చెప్పడం హాస్యాస్పదమని, సూపర్ సిక్స్ పై తెలంగాణలో ప్రశ్నిస్తాడా అని ఎద్దేవా చేశారు. తల్లికి కూడు పెట్టలేని వాడు పినతల్లికి పట్టుచీర పెడతాడనే సామెతను ఉటంకిస్తూ, పవన్ తీరును విమర్శించారు.

సంబంధిత పోస్ట్