అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాం. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది. అంటూ పవన్ కళ్యాణ్ Xలో పోస్ట్ చేశారు