AP: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నంలో ఒక రోజు ముందే ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నగరం నడిబొడ్డున భారీ 'ప్రీ-బర్త్ డే' సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఆయన సూపర్ హిట్ పాటలకు రోడ్లపై స్టెప్పులు వేస్తూ అభిమానులు కోలాహలం చేశారు. కేకులు కట్ చేస్తూ, శుభాకాంక్షల బ్యానర్లు ప్రదర్శిస్తూ అభిమానులు చేసిన రచ్చ చేశారు.