జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ తెలిపారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేయడం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ 10వ తేదీన ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.