పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'పంజా' సినిమా సెప్టెంబర్ 2న, ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ కానుంది. 2011లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. పవన్ నటన, లుక్స్, యువన్ శంకర్ రాజా సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సారా జేన్ డయాస్, తన నటనతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కాగా, 'పంజా' రీ-రిలీజ్ వార్తతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.