త్వరలో తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన

తెలంగాణలో జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరలో పర్యటించనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. జనసేన జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల కోసం ఇప్పటికే అడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పొత్తులు లేకపోయినా పోటీకి సిద్ధమేనని, అవసరమైతే సర్దుబాట్లు చేసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్