తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించనున్నారు. అక్కడ టీటీడీ సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో భేటీ కానున్నారు. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లతో భేటీ అవుతారు.