సిగరెట్ ఇవ్వలేదని పాన్ షాప్ నిర్వాహకుడిపై దాడి

రాజేంద్రనగర్ పరిధిలోని ఆర్ మాన్ పాన్ షాప్ వద్ద సిగరెట్ల విషయంలో తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సిగరెట్లు లేవని చెప్పినందుకు షాప్ నిర్వాహకుడు వసీమ్‌పై సుమారు 10 మంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుండి పరారవ్వగా, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్