తాను అనుభవించిన కష్టాలను గుర్తుచేసుకుని నటి పాయల్ రాజ్‌పుత్ సినిమా వేడుకలో కంటతడి పెట్టుకున్నారు. మంగళవారం నిర్వహించిన ‘ఫస్ట్ టైమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు.‘‘కొన్ని నెలల క్రితం జైపుర్‌లో విపాసన కోర్సులో జాయిన్ అయ్యా. అప్పుడే మా నాన్న క్యాన్సర్ బారిన పడ్డారు. మా కుటుంబానికి అది కష్టసమయం. జీవితంలో ఎలా ముందుకెళ్లాలన్నది నాకు తెలియలేదు‘ అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.