TG: వనపర్తి జిల్లా పెబ్బేరు బస్సు బోల్తా ప్రమాదంలో గాయపడిన శివప్రసాద్ (59) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివప్రసాద్ మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌లో ఈఈగా పనిచేస్తున్నారు. కాగా సోమవారం ఉదయం పెబ్బేరు వద్ద జరిగిన ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బస్సు మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తుండగా ముందు వెళ్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది.