పెద్దపల్లిలో శ్రీ కళ్యాణమస్తు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీనటి అనన్య

సినీనటి అనన్య పెద్దపల్లి పట్టణంలో సందడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే చింతపల్లి విజయ రమణారావుతో కలిసి శ్రీ కళ్యాణమస్తు షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో షాపింగ్ మాల్ పరిసరాలు సందడిగా మారాయి. శ్రీ కళ్యాణమస్తు షాపింగ్ మాల్‌లో ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా, ఆఫర్ ధరలలో అందుబాటులోకి తెచ్చిన ప్రత్యేకమైన చీరలకు మంచి స్పందన లభించడంతో తొలి రోజే భారీ ఎత్తున కొనుగోళ్లు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతపల్లి విజయ రమణారావుతో పాటు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్