జగిత్యాల జిల్లా ధర్మపురిలో పార్క్ చేసిన బైక్‌ను గుర్తుతెలియని దుండగుడు చాకచక్యంగా దొంగిలించాడు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. దుండగుడు బైక్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.