రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్.. మహిళ మృతి

ధర్మారం మండలంలో కరెంట్ వైర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామానికి చెందిన సంఘ కుమార్ తన తల్లి మల్లవ్వతో కలిసి కీచులాటపల్లి వెళ్తుండగా, ఎర్రగుంటపల్లి ఐకేపీ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా వేసిన కరెంట్ వైర్ కనిపించక ఓ బైక్ ఢీకొని అదుపుతప్పి మరో బైక్‌ను తాకడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన మల్లవ్వ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు SI ప్రవీణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్