రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

గొల్లపల్లి మండలంలోని గుంజపడుగులో ఆదివారం వేకువజామున ద్విచక్రవాహనం అజాగ్రత్తగా నడపడంతో పాదచారులను ఢీకొన్న ఘటనలో పురాణం లస్మక్క (63) అనే వృద్ధురాలు మృతి చెందగా, మోతె పోషవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లస్మక్క మరణించగా, పోషవ్వకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతురాలి కుమారుడు సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్