జగిత్యాల: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఆశావహుల్లో ఉత్కంఠ..!

కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆశావహులు బీఫాం కోసం తీవ్ర పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ప్రతి డివిజన్ లోనూ పలువురు అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. బీఫాం ఎవరికి దక్కుతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు అభ్యర్థులు తమకు సీటు ఖరారైందని ప్రచారం చేసుకుంటున్నా, ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. మరో రెండు రోజుల్లో బీఫాంలు అందించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్