పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

కోరుట్ల పట్టణం భీమునిడుబ్బ ప్రాంతానికి చెందిన గంగమల్లయ్య శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల రోజుల కిందట అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ఆయన, పట్టణ శివారులోని కల్లూర్లోడ్లో సొంత పొలానికి సమీపంలోని బేస్మెంట్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్