మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై సోషల్ మీడియాలో AI మార్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఫేస్‌బుక్‌లో అనుచిత కంటెంట్‌తో వీడియోలు పోస్టు చేశారంటూ న్యాయవాది శశిభూషణ్ కాశే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ మంథని పేరుతో నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు సోమవారం ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.