మంథనిలో బొడ్డెమ్మ వేడుకలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మొదటిరోజు బొడ్డెమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి పాల్గొన్నారు. రెడ్డి సంఘం భవనం ముందు బొడ్డమని పెట్టి, మహిళలందరూ కలిసి బొడ్డెమ్మ పాటలు పాడుతూ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతిరోజు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕