గోదావరిలో బోనాల జాతర: గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు

పెద్దపల్లి జిల్లా మంథనిలో బుధవారం గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర అట్టహాసంగా జరిగింది. బోయిన్ పేట్ నాగులమ్మ దేవాలయం నుండి గోదావరి వరకు బోనాలతో శోభాయాత్ర సాగింది. మంగళహారతులు, డప్పుల సప్పులతో మహిళలు, పురుషులు నాట్యం చేశారు. చేపలు పట్టే వలలతో విన్యాసాలు ప్రదర్శించారు. మంథనితో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరికి చేరుకున్నాక అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బోనాల జాతర సంవత్సరం ఒకసారి జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్