పెద్దపల్లి యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన శ్రీజ, శశివర్షిణి అనే ఇద్దరు యువతులు భారత సైన్యంలో అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వారిని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. దేశ సేవ కోసం భారత సైన్యంలో చేరడం గౌరవప్రదమని, ఈ ఎంపిక జిల్లా యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.