మంథని అంబేద్కర్ నగర్లో బోరు ప్రారంభించిన చైర్మన్

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బుధవారం నూతన బోరును మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రాజు గౌడ్ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రజలు, పాలకవర్గ సభ్యులు చైర్మన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్