పెద్దపల్లి జిల్లా మంథనిలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో టపాసులు పేల్చి, సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామాదేవి మాట్లాడుతూ, ఈ విజయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన పథకాలే కారణమని, రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, శీను బాబు, అభిమానులు పాల్గొన్నారు.