మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి "పల్స్ పోలియో" కార్యక్రమాన్ని సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ ప్రారంభించారు. తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్విని.యోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కంచు రాణి, వార్డ్ సభ్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.