ప్రభుత్వ విప్ విజయరమణారావు మంగళవారం ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ. 1 కోటి 35 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శివపల్లిలోని ఆయన నివాసంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో పాలకవర్గం, ఈఓ సదయ్య, అర్చకులు, సిబ్బంది విజయరమణారావు దంపతులను ఘనంగా సన్మానించి, ఆశీర్వచనములు అందజేశారు. ఆలయాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.