మంథని మార్కెట్ కూల్చివేతకు ఆదేశాలు.. వ్యాపారుల తరలింపు

పెద్దపల్లి జిల్లా మంథనిలో నూతన మార్కెట్ నిర్మాణంలో భాగంగా సోమవారం జేసీబీతో మార్కెట్‌ను కూల్చివేస్తామని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆదివారం మార్కెట్‌లోని బట్టల దుకాణాలు, పూసల దుకాణాలు, అల్లం-వెల్లుల్లి వ్యాపారులు తమ సరుకులను ఇళ్లకు తరలించుకున్నారు. అయితే, చికెన్, మటన్ వ్యాపారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు తెలిపారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రేపు మార్కెట్ కూల్చివేత కార్యక్రమం జరగనుంది.

సంబంధిత పోస్ట్