రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ కి మంథని ఎమ్మెల్యే వినతి

మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది డాక్టర్లకు గాను కేవలం 5 గురు మాత్రమే పని చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో వైద్యుల నియామకం చేయాలని కోరారు. మంథని, గద్దలపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఆసుపత్రి నుండి డిప్యుటేషన్ లపై పని చేస్తున్న డాక్టర్ నరేష్ ఆగంతం, మంథని మండలం గద్దలపల్లి ఆసుపత్రి నుండి డాక్టర్ టి.రవీందర్ లతో పాటు ఇతర సిబ్బంది డిప్యుటేషన్ లను రద్దు చేసి పూర్తిస్థాయి నియామకాలు చేయాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు ఇతర సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకొని రోగులకు సరిగ్గా సేవలు అందేట్టు చూడాలని తెలిపారు.

ఇట్టి ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది పనివేళలు సక్రమంగా పాటించేలా చేయాలని, డాక్టర్ల డిప్యుటేషన్ లు రద్దు చేసి ఇతర మౌలిక వసతులు మెరుగుపర్చాలని పలు అంశాలపై మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్, గద్దలపల్లి మాజీ ఎంపీటీసీ చంద్రు రాజమల్లులు చేసిన వినతిపై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇచ్చిన లేఖను హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు పేషీలో అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్