పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడ్డ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన సోషల్ జస్టిస్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 2024 ఫిబ్రవరి 4న తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ కుల సర్వే నిర్వహణకు, ఎస్సి కుల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ ఆదేశాలతో శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు.