పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె మంగళవారం 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా, కార్మికులు అమరవీరుల స్థూపం నుండి ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠకుల కళావతి, జక్కుల రాజేశ్వరి, ఎండి సలేహ, మేకల యశోద, లంక విజయలు పాల్గొన్నారు.