పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ, ప్రతి శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ శ్రామికులేనని, శ్రామిక హక్కులు, ప్రయోజనాలు పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. భారతదేశంలో 1923 నుండి మే డే వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు. జిల్లాలోని శ్రామిక సంఘాలకు కార్మిక శాఖ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కల్పించాలని ఆయన కోరారు.