ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు సమర్పించాలి..

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1 చివరి తేదీ అని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత శుక్రవారం తెలిపారు. 5 నుండి 8వ తరగతి విద్యార్థులకు న్యూ స్కీం పథకం కింద, 9, 10వ తరగతి విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన పథకం కింద ఈ స్కాలర్షిప్ అందించబడుతుంది. విద్యార్థులు ఈ-పాస్ లాగిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, హార్డ్ కాపీలను కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్