జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సోమవారం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవ్‌పల్లి ఆయిల్ పామ్ నర్సరీలను, ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్‌పల్లి ప్రభుత్వ భూములను, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. రెబ్బల్ దేవ్‌పల్లిలో 48 ఎకరాల నర్సరీలో ఖరీఫ్ సీజన్‌కు రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు నాణ్యమైన మొక్కల లభ్యత కీలకమని కలెక్టర్ తెలిపారు.