పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించగా, అధిక సంఖ్యలో భక్తులు హాజరై వీక్షించారు.