చిల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను ఆదివారం సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.