మంథనిలోని ప్రభుత్వ స్థలం, పాఠశాల, టాస్క్ భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. యువత ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టీజిఐఐసి సంస్థ ఆధ్వర్యంలో గార్మెట్ యూనిట్ల ఏర్పాటుకు 2 ఎకరాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.