ప్రారంభమైన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్‌లో సోమవారం 69వ రాష్ట్రస్థాయి అండర్-14 బాల బాలికల స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జన ప్రసాద్, ఏసిపి మడత రమేష్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే ఆటలు క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని, ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఒక ఆటల పీరియడ్‌ను తప్పనిసరి చేసినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్