పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ప్రలోభాలు జరగకుండా చూడాలని ఆమె సూచించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష, డిసిపి రాంరెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు నరసింహారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్