జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించి, సిబ్బంది కేటాయింపు నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించారు. నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ టి-యాప్ లో నమోదు చేయాలని, ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని ప్రోక్యూర్ చేయాలని సూచించారు.